సైబర్ నేరాల నివారణే లక్ష్యం
* జిల్లా ఎస్పీ నంద్యాల కోటి రెడ్డి
అక్షరవిజేత, వికారాబాద్ క్రైమ్
పోలీస్ స్టేషన్ల వారిగా నియమించిన సైబర్ వారియర్స్ తో జిల్లా ఎస్పీ గురువారం సమావేశం అయి జిల్లా లో జరుగుతున్న సైబర్ నేరాలు, ప్రజలు మోసపోతున్నారనీ తీరు, నమోదు అయిన కేసులలో ఫ్రీజ్ అయిన అమౌంట్, పోగొట్టుకున్న అమౌంట్ బాధితులకు తిరిగి అందజేసేందుకు తీసుకుంటున్న చర్యల పై జిల్లా ఎస్పీ సైబర్ వారియర్స్ తో సమావేశం లో పాల్గొనడం జరిగింది. ఇట్టి కార్యక్రమం లో సైబర్ నేరాల పై పిర్యాదు చేసేందుకు, బాధితులు తమ కేసులకు సంబందించిన సమాచారాన్ని తెలుసుకునేందుకు అనువుగా సైబర్ వారియర్స్ కు నూతన మొబైల్ ఫోన్స్, సిమ్ కార్డ్ ను ఎస్పీ సైబర్ వారియర్స్ కు అందించడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ కాలానుగుణంగా పెరుగుతున్న సైబర్ నేరాలను అరికట్టేందుకు సైబర్ వారియర్స్ తమ పోలీస్ స్టేషన్ ల ప్రజలకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని అన్నారు. సైబర్ నేరాలకు గురైన బాధితుల నుండి పిర్యాదు అందిన వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని, సైబర్ వారియర్స్ ఎప్పటికప్పుడు సైబర్ నేరాలపైనా కొత్త విషయాలను నేర్చుకోవాలి, సైబర్ నేరాల పైన వచ్చిన పిర్యాదులలో ఎలాంటి నిర్లక్ష్యం చేయవద్దు, సైబర్ వారియర్లు సైబర్ నేరాలకు సంబంచిందిన అన్నీ విషయాల పట్ల అవగాహన కల్గి జిల్లా లో సైబర్ నేరగాళ్ల అటకట్టించాలని, జిల్లాలో జరుగుతున్నా సైబర్ నేరాలకు సంబందించిన రికార్డ్స్ లను ఎప్పటికప్పుడు నమోదు చేసుకొని ప్రజలలో అవగాహన కల్పించాలి అని ఎస్పీ తెలిపినారు.
ఇట్టి కార్యక్రమం లో జిల్లా అదనపు ఎస్పీ రవీందర్ రెడ్డి, వికారాబాద్ జిల్లా సైబర్ సెక్యూరిటి బ్యూరో డిఎస్‌పి ప్రశాంత్ రెడ్డి, ఐ టి సి టి ఇన్స్పెక్టర్ రఘురామ్, ఐ టి సి టి ఎస్ ఐ రాధికా, సైబర్ వారియర్స్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.