పత్రిక ప్రకటన
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా
తేదీ 04_04_2024
వాంకిడి పోలీస్ స్టేషన్.
ఎన్నికలు శాంతియుతంగా జరిగేలా ప్రజలు సహకరించాలి…
-జిల్లా అదనపు ఎస్పీ ప్రభాకర్ రావు.
అక్షర విజేత ఉమ్మడి ఆదిలాబాద్ బ్యూరో..
వచ్చే పార్లమెంట్ ఎన్నికల ఎలాంటి అల్లర్లు. వర్గ బేధాలు లేకుండా శాంతియుతంగా ఎన్నికలు జరిగేలా ప్రజలు సహకరించాలని జిల్లా అదనపు ఎస్పీ ప్రభాకర్ రావు అన్నారు. బుధవారం ఉదయం 11గంటలకు వాంకిడి మండలంలోని ఖమాన గ్రామంలో డిఎస్పీ సదయ్య, వాంకిడి సీఐ శ్రీనివాస్. ఎస్ఐలు సాగర్ , రాములు, సీఆర్పిఎఫ్ దళాలతో కలసి ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు.ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతు.. భారత్ ఎలక్షన్ కమిషన్ సూచించిన గైడ్లైన్స్ ప్రకారం ప్రతి ఒక్కరూ విధులు నిర్వహించాలని. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల పై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు.ఎవరైనా చట్ట విరుద్ధంగా ప్రవర్తించిన, గొడవలు సృష్టించాలని చూస్తే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్నికల వేళ ఎలాంటి అనుమతులు లేకుండా దేవాలయాలు. మాజిద్. చర్చిలు. ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు. కార్యాలయంలో గోడపై ఎన్నికల ప్రచారం చేయరాదని. ఎన్నికల సమయంలో ఆయా పార్టీల నాయకులు ఇచ్చే మద్యం. డబ్బులు ప్రలోభాలకు ప్రజలు గురికావద్దని. ఎన్నికలు ప్రశాంతంగా సాగేందుకు ప్రజలు సహకరించాలని కోరారు. ఆనంతరం ఖమాన పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించారు.