వివాహ మహోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే కృష్ణప్రసాదు.
అక్షర విజేత మైలవరం నియోజకవర్గం ప్రతినిధి
ఇబ్రహీంపట్నం మండలం మూలపాడు గ్రామానికి చెందిన సాతులూరి శ్రీనివాసరావు కుమారుడు నాగ కిరణ్ పరిశుద్ధ వివాహ మహోత్సవం మూలపాడు లోని ఆర్.సి.ఎం చర్చిలో గురువారం జరిగింది.ఈ వివాహ మహోత్సవానికి హాజరైన మైలవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి, స్థానిక ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాదు నూతన వధూవరులను ఆశీర్వదించి,వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.