దశదిన కర్మకు హాజరైన ఎంపీటీసీ పెద్దబోయిన ఉమాశంకర్
అక్షర విజేత కారేపల్లి
మండలంలోని గేట్ కారేపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు గుడిపూడి నర్సయ్య మాతృమూర్తి వెంకటరామమ్మ(90) ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. గురువారం తొడితలగూడెం ఎంపీటీసీ పెద్దబోయిన ఉమాశంకర్, వెంకటరామమ్మ దశదిన కర్మకు హాజరై వారి చిత్రపటానికి పూలతో నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గేట్ కారేపల్లి మాజీ ఉపసర్పంచ్ వల్లభనేని చంద్రశేఖర్, కాంగ్రెస్ నాయకులు సాయిని తిరుపతయ్య, చెరుకూరి వెంకటేశ్వర్లు, ఎన్ఆర్ఐ గుడిపూడి తిరుమలరావు, దుగ్గినేని రామారావు, సాయిని తిరుపతిరావు, యువజన నాయకులు బాణోత్ కోటి, గుగులోత్ హారు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.