మోదీ ప్రభుత్వానికి బుద్ది చెప్పాలంటే….పార్లమెంటు ఎన్నికలలో ఓడించి ఇంటికి పంపాలి…
అక్షర విజేత గద్వాల బ్యూరో:
ఎక్సేంజ్ మరియు పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు…
-ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తున్న బిజెపి ప్రభుత్వం…
– నాగర్కర్నూల్ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్లు రవి
రాష్ట్రంలో బిఆర్ఎస్ కు పట్టిన గతే..కేంద్రంలో బిజెపి కి పడుతుంది..
గద్వాల జిల్లా జెడ్పి చైర్ పర్సన్, గద్వాల ఇంచార్జీ సరిత.మోదీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలంటే పార్లమెంటు ఎన్నికల్లో ఓడించి ఇంటికి పంపాలని ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు.
నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలోని బుధవారం తీగల వెంకటస్వామి కన్వెన్షన్ హాల్ నందు పార్లమెంటు ఎన్నికలలో భాగంగా నాగర్కర్నూల్ పార్లమెంటు నియోజకవర్గ కార్యకర్తల సన్నాహక సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
చరిత్రలో నిలిచిపోయే తరహాలో నాగర్కర్నూల్ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్లు రవి గారిని గెలుపించుకుందామని పార్టీ ప్రజాప్రతినిధులకు,నాయకులకు,కార్యకర్తలకు మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు వివిధ స్థాయి ప్రజాప్రతినిధులతో కలిసి పిలుపునిచ్చారు… ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ ని ఈ పార్లమెంటు ఎన్నికలలో అత్యధిక సీట్లు గెలుపించుకుని ప్రధానమంత్రి చేయవలసిన బాధ్యత ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తపై ఉందన్నారు. అనంతరం జోగులాంబ గద్వాల జిల్లా జడ్పీ చైర్పర్సన్ సరిత మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ కు పట్టిన గతే కేంద్రంలో బిజెపి పార్టీకి పడుతుందని ఆమె అన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు అభ్యర్థి మల్లు రవి మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న బిజెపి పార్టీ ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచిందని, ఇలాంటి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో ప్రణాళిక బోర్డు వైస్ చైర్మన్ జిల్లెల చిన్నారెడ్డి, మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కూచుకుల దామోదర్ రెడ్డి, నాగర్ కర్నూల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే కూచుకుల్ల రాజేశ్వర్ రెడ్డి, వనపర్తి ఎమ్మెల్యే మెగా రెడ్డి, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, అలంపూర్ మాజీ ఎమ్మెల్యే ఏఐసిసి కార్యదర్శి సంపత్ కుమార్, ఏఐసీసీ నెంబర్ జగదీశ్వరరావు, ఉమ్మడి పాలమూరు జిల్లా మాజీ జడ్పీ చైర్పర్సన్ బండారి భాస్కర్, నాగర్ కర్నూల్ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ బాలాజీ సింగ్, రాష్ట్ర యువజన అధ్యక్షులు స్పోర్ట్స్ చైర్మన్ శివసేన రెడ్డి, రాష్ట్ర ప్రాజెక్టుల చైర్మన్ చింతలపల్లి జగదీశ్వరరావు, మాజీ మంత్రివర్యులు చిత్తరంజన్ దాస్, మాజీ నాగర్ కర్నూల్ పార్లమెంటు సభ్యులు మంద జగన్నాథం, అలాగే నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ జెడ్పిటిసిలు,ఎంపిపిలు,మున్సిపల్ చైర్మన్లు,కౌన్సిలర్లు,అనుబంధ సంఘాల జిల్లా అధ్యక్షులు, మండల అధ్యక్షులు ముఖ్య కార్యకర్తలు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు…