Monday, April 21, 2025
spot_img

కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిని చూసి బిజెపి, బిఆర్ఎస్ నాయకులు బెంబేలెత్తిపోతున్నారు

కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిని చూసి బిజెపి, బిఆర్ఎస్ నాయకులు బెంబేలెత్తిపోతున్నారు

అక్షర విజేత, నిజామాబాద్ ప్రతినిధి

జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, రాష్ట్ర కోపరేటివ్ యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి బుధవారం భీంగల్ మండల కేంద్రంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా జీవన్ రెడ్డి పేరును ప్రకటించడం ద్వారా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో కొత్త ఉత్తేజం మొదలైందని, అదేవిధంగా గత పది సంవత్సరాలుగా కవిత, అరవింద్ లను ఎంపీగా గెలిపించడం ద్వారా నియోజకవర్గం పూర్తిగా వెనుకబడిపోయిందని, అనుభవంలేని వారిని గెలిపించుకోవడం ద్వారా పార్లమెంట్ యొక్క స్థితిగతులు పూర్తిగా మారిపోయాయని దీనిని జిల్లా ప్రజలు గమనించారని ఆయన అన్నారు. కల్వకుంట్ల కవిత, అరవింద్ లను గెలిపించుకోవడం ద్వారా అభివృద్ధిలో ముందుకు వెళ్లాల్సిన నిజామాబాద్ నియోజకవర్గ పూర్తిగా వెనుకబడి పోయిందని, వీరిద్దరిలో ఒకరు తమ వ్యాపారాల కోసం మరొకరు ప్రచారం కోసం మాత్రమే పని చేశారని ప్రజల సమస్యలను పక్కన పెట్టారని ఆయన అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే రాష్ట్రంలో గణనీయమైన మార్పులు తీసుకువచ్చిందని అందులో ముఖ్యంగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, ఆరోగ్యశ్రీని 10 లక్షల వరకు పెంచడం, ప్రతి నియోజకవర్గంలో 3500 ఇందిరమ్మ ఇండ్ల కొరకు ఐదు లక్షల రూపాయలు, ఎస్సీ ఎస్టీలకు ఇండ్ల నిర్మాణం కొరకు ఆరు లక్షల రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుందని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఇన్ని అభివృద్ధి పనుల వల్ల బిజెపి, బీఆర్ఎస్ నాయకులు బెంబేలెత్తిపోతున్నారని, నిజామాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అనుభవాగ్నులైన జీవన్ రెడ్డి రావడం వల్ల నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతుందనే ఆలోచనతో నియోజకవర్గ ప్రజలు ఉన్నారని ఆయన అన్నారు. ఎన్నికల ముందు షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తానని చెప్పిన కవిత తెరిపించలేదని, అదేవిధంగా పసుపు బోర్డు తీసుకువస్తానని బాండ్ పేపర్ రాస ఇచ్చిన అరవింద్ ఒక అబద్ధపు జీవోను తీసుకువచ్చారని, ప్రభుత్వం జీవోను విడుదల చేస్తే పసుపు బోర్డు ఎక్కడ ఏర్పాటు చేస్తున్నాం దాని విధివిధానాలను రూపొందించి స్పష్టత ఇస్తుందని కానీ అలాంటిదేవీ లేకుండా పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగిందని, నిజంగా పసుపు బోర్డు నిజామాబాద్ లో ఏర్పాటు చేస్తారా లేక గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఏర్పాటు చేస్తార అనే స్పష్టత అరవింద్ ఇవ్వాలని మానాల మోహన్ రెడ్డి ప్రశ్నించారు. అజ్ఞాని అయిన అరవింద్ చేతిలో నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పెట్టి పూర్తిగా నియోజకవర్గ అభివృద్ధి వెనుకబడి విధంగా చేసుకోవడం జరిగిందని, కావున నియోజకవర్గ ప్రజలు సరైన ఆలోచనతో అనుభవాగ్నులైన జీవన్ రెడ్డిని అధిక మెజారిటీతో గెలిపించాలని మోహన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు బొదిరే స్వామి, పట్టణ అధ్యక్షుడు జయ నరసయ్య, నియోజకవర్గ యూత్ ఇంచార్జి నాగేంద్ర, జిల్లా యూత్ వైస్ ప్రెసిడెంట్ వాకా మహేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి కుంట రమేష్, మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు అనంత రావు, మండల మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు, దేశాయి కల్పన, వెంకమ్మ గంగమణి, యూత్ టౌన్ ప్రెసిడెంట్ మహేష్, యూత్ జిల్లా కార్యదర్శి చరణ్, సురేష్ సతీష్, రవి, ఎన్.ఎస్.యు.ఐ జిల్లా కార్యదర్శి రెహమాన్, బుర్రన్న నారాయణ, శ్యామ్ రాజ్, లక్ష్మణ్, పృథ్వీరాజ్, శివగంగాధర్, బాలయ్య, జెసిబి రాజన్న, తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles