దొడ్డి కొమురయ్య 97 జయంతి వేడుకలు జరిపిన చొప్పదండి కురుమ యువజన సంఘం
అక్షర విజేత,చొప్పదండి;
విప్లవ వీరుడు తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దోడ్డి కొమరయ్య 97 జయంతి వేడుకలు చొప్పదండి పట్టణంలోని కురుమ యువజన సంఘం ఆధ్వర్యంలో జరిపారు అధ్యక్షులు జిట్ట కుమార్ దొడ్డి కొమురయ్య చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు అనంతరం మాట్లాడుతూ యువత దొడ్డి కొమురయ్య అడుగుజాడల్లో మరియు వారి ఆశయాలు నెరవేర్చాలని కోరడం జరిగింది అలాగే ఈ వేదిక ద్వారా హైదరాబాదులోని ట్యాంక్ బాండ్ పై దొడ్డి కొమురయ్య విగ్రహం ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ నీట్టు మునేష్ ,గుంటి స్వరూప, రాజన్నల తిరుపతి, నీట్టు శ్రీనివాస్, పెద్ది సంపత్, అనిల్, శ్రీనివాస్, వంశీ, రాకేష్, బీరయ్య, వంశీ కమిటీ సభ్యులు పాల్గొనడం జరిగింది