అరట్లకోటలో టిడిపి ఉమ్మడి అభ్యర్థి వంగలపూడి అనిత ఎన్నికల ప్రచారం
అక్షరవిజేత, పాయకరావుపేట.
మండలంలోని అరట్లకోటలో టిడిపి రాష్ట్ర తెలుగు మహిళా అధ్యక్షురాలు, పొలిట్ బ్యూరో సభ్యురాలు, పాయకరావుపేట నియోజవర్గం టిడిపి, జనసేన, బిజెపి అభ్యర్థి వంగలపూడి అనిత ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రజాగళం యాత్రలో భాగంగా వంగలపూడి అనితకు టిడిపి, జనసేన నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం అనిత ఇంటింటికీ తిరుగుతూ కరపత్రాలు పంపిణీ చేశారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్న అనిత మాట్లాడుతూ వచ్చేది ఉమ్మడి ప్రభుత్వమని, అధికారం చేపట్టిన తర్వాత ప్రజలు ఇబ్బందులు అన్నింటినీ పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. త్వరలో జరగబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ సైకిల్ గుర్తు, కమలం గుర్తులకు ఓటేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల పార్టీ అధ్యక్షులు పెద్దిరెడ్డి చిట్టిబాబు, జనసేన మండల పార్టీ అధ్యక్షుడు యగదాశి నానాజీ, బిజెపి మండల పార్టీ అధ్యక్షుడు వేముల వెంకటేశ్వరరావు, గ్రామ సర్పంచ్ పులగపూరి అప్పలనర్స, టిడిపి గ్రామ శాఖ అధ్యక్షుడు కట్టా శ్రీను, జనసేన గ్రామ శాఖ అధ్యక్షుడు తుమ్మల గణేష్, ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి దేవవరపు రఘు, జనసేన పార్టీ మండల సహయ కార్యదర్శి గర్లంక నానాజీ, తెలుగుదేశం నాయకులు పల్లా విలియం కేరీ, పెదిరెడ్డి పండు, చిక్కాల శ్రీను, వేములపూడి అప్పారావు, కుందూరు కుమార్, పెద్ద సంఖ్యలో టిడిపి ,బిజెపి, జనసేన పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.