వైసిపి తీర్థం పుచ్చుకున్న తెదేపా,జనసేన,కార్యకర్తలు, నాయకులు
అక్షర విజేత మైలవరం నియోజకవర్గ ప్రతినిధి
ఎన్టీఆర్ జిల్లా, జక్కంపూడి, తెలుగుదేశం,జనసేన కార్యకర్తలను, నాయకులను, వైఎస్ఆర్సిపి పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించిన మైలవరం నియోజకవర్గం వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థి సర్నాల తిరుపతిరావు. సర్నాల వెంటే మేమంతా జక్కంపూడి, షాబాద్ గ్రామస్తులు.విజయవాడ రూరల్ మండలపార్టీ అధ్యక్షులు బయ్యారపు రవి కిషోర్, పైడూరుపాడు గ్రామ సర్పంచ్ వేముల సీతారామయ్య ఆధ్వర్యంలో షాబాద్, జక్కంపూడి తెలుగుదేశం జనసేన నాయకులు కార్యకర్తలు 70 కుటుంబల వారు మైలవరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే అభ్యర్థి స్వర్ణాల తిరుపతిరావు, చేతులమీదుగా వైఎస్ఆర్సిపి పార్టీ కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థి తిరుపతిరావు మాట్లాడుతూ..మనం మంచి మనసున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పేదవారికి అండదండగా నిలిచేటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంటే మేమంతా ఉంటామని వచ్చినందుకుసంతోషాన్ని వ్యక్తం చేశారు.ఇది పెత్తం దారుల పార్టీ కాదు, ఇది పేదల పార్టీ అని పేదవారికి అండదండగా ఉంటానికే ఈ పార్టీని జగన్మోహన్ రెడ్డి, స్థాపించి పేదవాడికి ఎన్ని రకాలుగా మేలు చేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ని ఈ సందర్భంగా తెలియజేశారు,మనందరం ఐక్యమత్యం గా ఉండి కలిసి పనిచేసి 2024 లో జగన్మోహన్ రెడ్డి ని సీఎం చేసుకోవడానికి మైలవరం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిని ఫ్యాను గుర్తుపై ఓటేసి మనమందరం జగన్మోహన్ రెడ్డి ని ముఖ్యమంత్రిని చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు.ఈ సందర్బంగా జక్కంపూడి, షాబాదా గ్రామస్తులు,మాట్లాడుతూ…సామాన్యుడు అయినా సర్నాల తిరుపతి రావు కి మైలవరం నియోజకవర్గ వైయస్సార్ పార్టీ టికెట్ ఇచ్చి పేద వాడి,పట్ల ఆయనకున్న ప్రేమ ను చాటుకున్నారని,జక్కంపూడి షాబాద్ గ్రామస్తులు అందరం సర్నాల తిరపతి రావు అన్న వెంట మేమంతా ఉంటామని అత్యధిక మెజారిటీ తో గెలిపించు కుంటామని తెలియజేసినారు.ఈ కార్యక్రమంలో జక్కంపూడి, షాబాద్, తెలుగుదేశం జనసేన, కార్యకర్తలు, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు