ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే అభ్యర్థి సర్నాల తిరుపతి రావు
అక్షర విజేత మైలవరం నియోజకవర్గ ప్రతినిధి
మైలవరం పట్టణ వైఎస్ఆర్సిపి ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే అభ్యర్థి సర్నాల తిరుపతి రావు మరియు నియోజకవర్గ పరిశీలకులు కర్ర హర్షవర్ధన్ రెడ్డి మరియు అప్పిడి కిరణ్ కుమార్ రెడ్డి. ఎన్టీఆర్ జిల్లా,మైలవరంలో వైఎస్ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తల ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన మైలవరం నియోజకవర్గ పరిశీలకులు కర్ర హర్ష వర్ధన్ రెడ్డి మాట్లాడుతూ..మైలవరం నియోజకవర్గ ప్రజలంతా జగనన్న కుటుంబం అని అందరూ ఐకమత్యంగా ఉండి మైలవరం వైఎస్ఆర్సిపి అని మరొకసారి తెలియజేసే విధంగా మైలవరం నియోజకవర్గం నుండి మన అభ్యర్థి సర్నాల తిరుపతి రావు ని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో మైలవరం పట్టణ వైయస్సార్ పార్టీనాయకులు, కార్యకర్తలు, అభిమానులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, పాల్గొన్నారు.