వైకాపాకు చివరి రోజులు: తెదేపా నేత జూలకంటి శోభారాణి
అక్షరవిజేత,రెంటచింతల
రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వానికి చివరి రోజులు దగ్గరపడ్డాయని,అందుకే అందరూ తెదేపాలోకి చేరుతున్నారని మాచర్ల నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి సతీమణి శోభారాణి అన్నారు.ఇంటింటికీ జూలకంటి ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా సోమవారం రెంటచింతలకు విచ్చేసిన ఆమెకు స్థానిక దేశం నేతలు,అభిమానులు,కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.స్థానిక రేగులమాన్యం కాలనీ నుంచి ప్రచారం నిర్వహించిన ఆమె ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం సూపర్ సిక్స్ పథకాల కరపత్రాలు పంచుతూ సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు.పార్టీ గెలుపు ఆవశ్యకతను ప్రజలకు వివరిస్తూ ఐదేళ్ల వైకాపా అరాచక పాలనకు స్వస్తి పలికి రాష్ట్ర భవిష్యత్తును కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు.తెదేపా రూపొందించిన సూపర్ సిక్స్ పథకాలతో రాష్ట్ర ప్రజలకు ఉజ్వల భవిష్యత్తు చేకూరుతుందన్నారు. వైకాపా పాలనలో ప్రజలకు సంతోషంగా లేరని,రానున్న ఎన్నికల్లో వైకాపా ప్రభుత్వానికి ఓటుతో బుద్ధి చెప్పాలని ప్రజలను కోరారు.తెదేపా అధికారంలోకి వస్తేనే అన్ని వర్గాలకు న్యాయం కలుగుతుందన్నారు. నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే వచ్చే ఎన్నికల్లోతెలుగుదేశం పార్టీ జెండా ఎగరాలన్నారు.నియోజకవర్గాన్ని అభివృద్ధి చేద్దామని వచ్చిన జూలకంటి కుటుంబాన్ని ఆదరించి ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో ఆమె వెంట పార్టీ మండల అధ్యక్షుడు చపారపు అబ్బిరెడ్డి, సీనియర్ నేత దండే శివయ్య,అంకమ్మ, సుమంత్ రెడ్డి, మూలి రాజారెడ్డి, బోడపాటి రామకృష్ణ, లక్ష్మారెడ్డి తదితరులు ఉన్నారు.