ఆదివాసి హక్కులు చట్టాలు రక్షించే సిపిఎం అభ్యర్థులను గెలిపించండి
అక్షర విజేత అరకులోయ
ఆదివాసి హక్కులు,చట్టాల అమలుకై,జీవో నెంబర్ 3 చట్టబద్ధత కల్పించి 100% శాతం రిజర్వేషన్ అమలుకై,1/70 చట్టం అమలుకై,అటవీ సవరణ చట్టం రద్దుకై,బోయ వాల్మీకి లకు ఎస్టి జాబితాలో చేర్చొద్దని, ఆదివాసి స్పెషల్ డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలని, ఆదివాసి ప్రాంతంలో 100% ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఆదివాసులకు ఇవ్వాలని పోరాడుతున్న సిపిఎం పార్లమెంట్,అసెంబ్లీ అభ్యర్థులకు ఆదివాసి ప్రజానీకం ఓట్లు వేసి గెలిపించి చట్టసభలకు పంపాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కే సురేంద్ర అనంతగిరి జెడ్పిటిసి డి గంగరాజు సిపిఎం జిల్లా నాయకులు పి.బాలదేవ్ పిలుపునిచ్చారు.
అరకు వేలి మండలం చిన్నలబుడు పంచాయతీ తురాయిగూడ,కరాయిగూడ గ్రామం లో ఓలే మహిమ దేవస్థానం ఆవరణంలో మంగళవారం జరిగిన సమావేశంలో సిపిఎం నాయకులు మాట్లాడుతూ
పార్లమెంట్, అసెంబ్లీ చట్టసభల్లో గళం విప్పి ఆదివాసుల కోసం ఆదివాసుల హక్కులు చట్టాల కోసం ఆదివాసుల సమస్యల పరిష్కారం కోసం నిలబడి మాట్లాడి పోట్లాడి ఆదివాసుల సమగ్ర అభివృద్ధి కోసం పనిచేసే అభ్యర్థులకు ఆదివాసి ప్రజానికం ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. చినలబుడు పంచాయతీలో అత్యధిక మంది వ్యవసాయ రైతులు ఉన్నారని రైతులు కాయగూరలు పప్పు దినుసులు పంటలకు గిట్టుబాటు ధర ఇవ్వాలని కోల్డ్ స్టోరేజ్ నిర్మాణం చేయాలని రైతులు పండించిన పంటలు మార్కెట్ సదుపాయం కల్పించి ఉచిత రవాణా సౌకర్యం కల్పించాలని పంచాయితీలో మరమ్మతుకు గురైన 9 చెక్ డ్యామ్ లు తక్షణమే మరమ్మత్తు చేసి సుమారు 600 ఎకరాలకు సాగునీరు అందించాలని అన్నారు సిపిఎం ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులు గెలిస్తే చిన్నలబుడు పంచాయితీకి కోల్డ్ స్టోరేజ్ నిర్మిస్తామని 9 చెక్ డ్యాములు మరమ్మత్తు చేసి రైతులకు సాగునీరు అందిస్తామని అరకు వేలి నుండి కరాయిగూడ మాలివలస రోడ్లు నిర్మిస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కమిటీ సభ్యులు కె మొద్దు నాయకులు లోక్కోయి సహదేవ్ గాసి రత్నకుమారి ముకుంద్ ఒలేక్ మహిమ దేవస్థానం పెద్దలు మహిళలు గ్రామస్తులు పాల్గొన్నారు.