సర్దార్ సర్వాయి పాపన్న 315 వ వర్ధంతి సందర్భంగా పూలమాల వేసిన అమ్మాయిపల్లి గౌడ సంఘ సభ్యులు.
అక్షరవిజేత చిన్నంబావి
వనపర్తి జిల్లా చిన్నంబావి మండల పరిధిలోని అమ్మాయి పల్లి గ్రామంలో బహుజన విప్లవ వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న 315 వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అమ్మాయిపల్లి గ్రామ గౌడసంఘ సభ్యులు.మొగల్ పాలకుల పెత్తనానికి,పాలనకు వ్యతిరేకంగా దళిత బహుజనులను తమ నాయకత్వంలో ఏకం చేసి రాజ్యాధికార పోరాటాన్ని కొనసాగించిన దళిత బహుజన విప్లవ వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్.ఈ సందర్భంగా అమ్మాయి పల్లి గ్రామ గౌడ సంఘ సభ్యులు మాట్లాడుతూ దొరలు,భూస్వాముల ను ఎదుర్కోవడానికి మొదటగా తన సొంత ధనాన్ని ఖర్చు పెట్టి ఆయుధాల్ని సమకూర్చడానికి అనగారిన కులాలను ఐక్యం చేసి సైనికులుగా మలుచుకున్నాడు.సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ నాయకత్వంలో దళిత బహుజనులు ఐక్యంగా నిలిచి భూస్వాముల మీద పోరాటం చేసి విజయం సాధించారని ఆయన వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో అమ్మాయిపల్లి గ్రామ గౌడ సంఘ సభ్యులు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.