శ్రీ సుబ్రహ్మణ్యస్వామివారికి విశేష అభిషేకం
అక్షరవిజేత, శ్రీశైలం :
శ్రీశైల క్షేత్రం లోక కల్యాణం కోసం మంగళవారం ఉదయం ఆలయ
ప్రాంగణంలోని శ్రీసుబ్రహ్మణ్యస్వామి కుమారస్వామి వారికి విశేష పూజలను నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా జరిగేందుకు మహాగణపతిపూజ జరిపించబడింది.
అనంతరం శ్రీసుబ్రహ్మణ్యస్వామివారికి అభిషేకము, అర్చన తరువాత సుబ్రహ్మణ్యస్తోత్రము పారాయణలు చేయబడ్డాయి.సుబ్రహ్మణ్యస్వామి అభిషేకంలో స్వామివారికి పంచామృతాలైన పాలు, పెరుగు, తేనె,నెయ్యి, కొబ్బరినీళ్లు మరియు వివిధ పండ్ల రసాలతో అభిషేకం నిర్వహించడం జరిగింది.