మోర్తాడ్ గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులను సన్మానించిన మండల కాంగ్రెస్ నాయకులు
అక్షర విజేత, మోర్తాడ్
నూతనంగా ఏకగ్రీవంగా ఎన్నికైన మోర్తాడ్ గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులను మండల కాంగ్రెస్ నాయకులు మంగళవారం ఘనంగా సన్మానించారు. మోర్తాడ్ గ్రామ అభివృద్ధి అధ్యక్షులు జక్కం అశోక్, కార్యదర్శి రాజు విట్టల్, ఉప కార్యదర్శి కడప టి రాజేశ్వర్, చెక్ పవర్ జక్కం పృథ్వీరాజ్, కోశాధికారి దడివే అశోక్, సలహాదారులుగా దోమ్మట్టి హరీష్ గౌడ్లను మండల కాంగ్రెస్ అధ్యక్షులు ముత్యాల రాములు, మోర్తాడ్ గ్రామ పట్టణ అధ్యక్షులు పుప్పల అశోక్, బద్దం మైపాల్, కాంగ్రెస్ నాయకులు నరసయ్య, గంగారాం, పలువురు నాయకులు నూతన గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులుగా ఎన్నికైన వారిని శాలువలతో సన్మానించారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ నూతన కాంగ్రెస్ ప్రభుత్వంలో మోర్తాడ్ గ్రామనూతన గ్రామం కమిటీ సభ్యులుయువకులు ఎన్నిక కావడం ఇదే తొలిసారి కావడం గర్వకారణమని కొనియాడారు. బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ ఇంచార్జి నాయకులు సునీల్ రెడ్డి సహకారంతో గ్రామ అభివృద్ధికి నూతన గ్రామ ఉదికంఠ సభ్యులు కృషి చేస్తారని, తమ వంతు సహకార సహకారాలు అందిస్తామని వారు పేర్కొన్నారు.