వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
అక్షర విజేత పిట్లం.
పిట్లం మండలం రాంపూర్(కలన్) గ్రామంలో మంగళవారం వ్యవసాయ సహకార సంఘ సెక్రటరీ సంతోష్ రెడ్డి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…ఏ గ్రేడ్ వారి ధాన్యం మద్దతు ధర 2,203,బి గ్రేడ్ వారి ధాన్యం మద్దతు ధర 2,183 గా నిర్ణయించినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో సొసైటీ సిబ్బంది,గ్రామ పెద్దలు,గ్రామ ప్రజలు పాల్గొన్నారు.