రోడ్డు ప్రమాదం వ్యక్తి మృతి
అక్షర విజేత అలంపూర్
ఉండవెల్లి మండలం అలంపూర్ చౌరస్తా ఫ్లైఓవర్ వంతెన పై జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. ఉండవెల్లి ఎస్సై వివరాల మేరకు గద్వాల ఎం ఎ ఎల్ డి కాలేజీలొ విధులు నిర్వహిస్తున్న విజయ భానుమూర్తి కర్నూల్ నుండి మోటార్ సైకిల్ పై వెళ్తుండగా అలంపూర్ చౌరస్తా ఫ్లై ఓవర్ బ్రిడ్జిపై గుర్తుతెలియని వాహనం ఢీకొని మృతి చెందినట్లు తెలిపారు. కేసు నమోదు చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం అలంపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్టు పేర్కొన్నారు. అలంపూర్ మండలం క్యాతూర్ గ్రామానికి చెందిన విజయ భానుమూర్తి కర్నూల్ లో సెటిల్ అయ్యారు.మృతుడు గతంలో వీఆర్ఏ గా విధులు నిర్వహించారు.బదిలీలలో ప్రస్తుతం గద్వాల ఎం ఎ ఎల్ డి కాలేజీలో పనిచేస్తున్నారు.