ఇఫ్తార్ విందులో పాల్గొన్న రాష్ట్ర జిల్లా కాంగ్రెస్ నాయకులు
అక్షర విజేత, మోర్తాడ్
బాల్కొండ నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు బాల్కొండ మాజీ ఎమ్మెల్యే, ఖనిజ గనుల, మినరల్ డెవలప్మెంట్ చైర్మన్ ఈరవత్రి అనిల్ ,జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రాష్ట్ర సహకార సంఘాల యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి,గోర్త రాజేందర్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఇఫ్తార్ విందులో ముస్లిం తోటి ముస్లిమ్స్ సోదరులతో నమాజులు (ప్రార్థనలు) నిర్వహించారు. తోటి ముస్లిం సోదరులతో విందులో పండ్లు, ఫలహారాలు భుజించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ రాష్ట్ర, జిల్లా, నాయకులు మాట్లాడుతూ రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు ఎంతో పవిత్రంగా ప్రార్థనలు చేస్తారని, కటోరమైన ఉపవాస దీక్షలు చేపడతారని వారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లింల అభివృద్ధి సంక్షేమానికి ఎంతో ప్రాధాన్యతనికి కృషి చేస్తుందని తెలిపారు. గతంలో వైయస్సార్ మాదిరిగానే ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్ అమలు చేసి తీరుతామన్నారు. ఇఫ్తార్ విందు ఏర్పాటుచేసిన నేపాధ్యంలో ముస్లిం సోదరులకు రంజాన్ మాస శుభాకాంక్షలు తెలిపారు. వీరితో పాటు బాల్కొండ మండల కాంగ్రెస్ అధ్యక్షులు వెంకటేష్ గౌడ్,బాల్కొండ మండల మైనార్టీ అధ్యక్షులు జావేద్, మెండోరా మండల కాంగ్రెస్ అధ్యక్షులు ముత్యం రెడ్డి, ముఫ్కల్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు మగ్గిడి ముత్యం రెడ్డి, వేల్పూరు మండల కాంగ్రెస్ అధ్యక్షులు నర్సారెడ్డి,మార్కెట్ కమిటీ చైర్మన్ రవి ,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అడెం గంగ ప్రసాద్,యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు నాగేంద్ర, జనరల్ సెక్రెటరీ రవి,యూత్ కాంగ్రెస్ నాయకులు రము,టౌన్ అధ్యక్షులు సంజీవ్ , కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.