సజ్జ పంటలో కత్తెర పురుగు నివారణకు సస్యరక్షణ చర్యలు చేపట్టాలి
అక్షర విజేత, మోర్తాడ్
బాల్కొండ మండలంలో కత్తెర పురుగు సోకిన సజ్జ పంట పొలాలను వ్యవసాయ శాఖ అధికారులు మరియు శాస్త్రవేత్తలు శనివారం సందర్శించి రైతులు సాగు చేస్తున్న పలు పంటలను పరిశీలించడం జరిగినది. ఈ సందర్భంగా కృషి విజ్ఞాన కేంద్రం రుద్రూర్ శాస్త్రవేత్త విజయ్ పంటలను సందర్శించి పరిశీలించి రైతులకు పలు సూచనలు సలహాలు రోగ నివారణపై రైతులతో మాట్లాడారు. ప్రస్తుతము సజ్జ పంటలో కత్తెర పురుగు యొక్క ఉధృతి అధికంగా ఉన్నట్లు గమనించడం జరిగినది వేడి వాతావరణం లో కత్తెర పురుగు జీవిత చక్రం తొందరగా ముగించుకొని పంటను విచ్చలవిడిగా ఆశించి తీవ్రంగా నష్టపరుస్తుందని తెలిపారు. కావున సజ్జలో ప్రస్తుతం సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. విత్తనము విత్తుకునే ముందు విత్తన శుద్ధి సయాలోత్రీన్ ప్లస్ తయోమితాక్షమ్ 0.6 మిల్లీలీటర్ కిలో విత్తనానికి చేసుకోవాలి.అలాగే ఎకరానికి 8 నుండి 10 లింగాకర్షక బుట్టలను పంటకు ఒక ఫీట్ ఎత్తున అమర్చుకోవాలి.. బాగా ఎదిగిన లార్వాలు పంటలో గమనించినట్లయితే విషపు ఎర ఉండలుగా చేసుకొని సాయంత్రం వేళల్లో మొక్క సుడులలో వేసుకోవాలి విషపు ఎర తయారు చేసుకోవడానికి 10 కిలోల తౌడు, 2 కిలోల బెల్లం మరియు తయోమితాక్సమ్ లేదా క్లోరోపైరీఫాస్ ఉపయోగించుకోవాలి.రసాయనక నివారణ చర్యల్లో భాగంగా క్లోరాoత్రనీలిప్రోల్ 0.4 ఎంఎల్ లేదా స్పైనాఠోరం 0.5 ఎంఎల్ లేదా థయోమెతక్సిమ్ + లాండా సాహలోత్రిన్ 0.25 ఎంఎల్ లీటరు నీటికి ఏదేని ఒకదానిని రెండు వందల లీటర్ల నీటిలో కలుపుకొని పిచికారి చేసుకోవాలి. భీంగల్ వ్యవసాయ ఎడిఏ మల్లయ్య , మండల వ్యవసాయ అధికారి మహేందర్ రెడ్డి, రైతులు పాల్గొన్నారు