మాజీ జిల్లా వక్ప బోర్డు చైర్మన్ ను పరమార్శించిన ముత్యాల సునీల్ కుమార్ రెడ్డి
అక్షర విజేత, మోర్తాడ్
మాజీ జిల్లా వక్ఫ్ బోర్డ్ చైర్మన్ జావీద్ అక్రమ్ తోపాటు వారి కుటుంబ సభ్యులను బాల్కొండ నియోజకవర్గ ఇన్చార్జ్ కాంగ్రెస్ నాయకులు ముత్యాల సునీల్ కుమార్ రెడ్డి తో పాటు, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గిర్మాజీ గోపి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఎం.డి నశీర్ , ఎం. డి. జావిద్, పలువురు కాంగ్రెస్ నాయకులు సోమవారం పరామర్శించారు. మాజీ జిల్లా వక్ చైర్మన్ అక్రమ్ సతీమణి మరణించిన విషయాన్ని తెలుసుకొని జిల్లా కేంద్రానికి తరలివెల్లి పరామర్శించారు. అధైర్య పడవద్దని, మనోధైర్యాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో మోర్తాడ్ మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.