వడదెబ్బ నివారణకు ప్రత్యేక చర్యలు
అక్షర విజేత సిద్దిపేట్
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ…
వేసవి కాలంలో త్రాగునీటి సరఫరాపై అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేసుకుని సన్నద్ధంగా ఉండి, ప్రతి రోజు త్రాగునీటి సరఫరాను పర్యవేక్షిస్తూ ప్రజలకు ఎక్కడ, ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని అన్నారు. జిల్లా వ్యాప్తంగా సజావుగా త్రాగునీటి సరఫరా చేసేందుకు అవసరమైన పనులు పూర్తి చేయాలి. స్థానికంగా అందుబాటులో ఉన్న నీటి వనరులతో రూపొందించిన ప్రత్యామ్నాయ వ్యవస్థలను వినియోగించుకుంటూ గ్రామ స్థాయిలో రానున్న రెండు నెలలకు త్రాగునీటి సరఫరా కార్యాచరణ రూపొందించుకోవాలని సూచించారు. పట్టణాలలో, గ్రామాలలో త్రాగునీటి సరఫరా ఇబ్బందులు ఉన్న ప్రాంతాలకు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా నీటి సరఫరా చేయాలి. రానున్న రెండు నెలల పాటు క్షేత్ర స్థాయిలో త్రాగునీటి సరఫరాలో ఉత్పన్నమయ్యే సమస్యలను వెంటనే గుర్తించి వాటిని సత్వరం పరిష్కారం అయ్యే విధంగా చర్యలు తీసుకుని ఎక్కడ కూడా నీటి కొరత ఉందని వార్త రాకుండా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
జిల్లాలో ఉన్న 980 ప్రభుత్వ పాఠశాలల్లో త్రాగునీటి సౌకర్యం, నిరుపయోగంగా ఉన్న టాయిలెట్లను ఉపయోగంలోకి తీసుకుని రావడం, అదనపు టాయిలెట్ల నిర్మాణం, తరగతి గదుల మైనర్, మేజర్ మరమ్మత్తులు, తరగతి గదులకు విద్యుత్ సౌకర్యం కల్పన వంటి పనులు వేగవంతంగా పూర్తి చేయాలని అన్నారు. పాఠశాలలో మౌళిక వస్తువుల కల్పనకు ప్రతి మండలంలో పనుల పర్యవేక్షణ చేసి, క్షేత్ర స్థాయిలో మరోసారి పాఠశాలలను తనిఖీ చేసి పక్కగా ప్రతిపాదనలు రూపొందించాలి. ప్రతి మండల స్థాయిలో పాఠశాలలో మౌళిక వసతుల కల్పనపై సంబంధిత ఇంజనీరింగ్ అధికారులు, ఎంపీడీవో, పాఠశాల నిర్వహణ కమిటీలతో వర్క్ షాప్ ఏర్పాటు చేయాలని అన్నారు. పాఠశాలలో మౌళిక వసతుల కల్పన కోసం అవసరమైన నిధులను ప్రభుత్వం అందిస్తుందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని, ప్రతి పాఠశాలలో అవసరమైన పనులు పాఠశాలలు ప్రారంభం అయ్యే ముందే పూర్తి చేయాలని సూచించారు.
ఎండ తీవ్రత రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు వడ దెబ్బలకు గురి కాకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని, ఇప్పటికే అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయని, ఏప్రిల్, మే నెలలో ఇంకా అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. వడదెబ్బ తగిలిన వారికి అవసరమైన ప్రథమ చికిత్స సత్వరమే అందేలా చూడాలని, క్షేత్ర స్థాయిలో పని చేసే సిబ్బందికి ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందించాలని, ఉపాధి హామీ పనుల నిర్వహణ సమయంలో కార్మికులకు అవసరమైన నీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందించాలని అన్నారు. ప్రతి ఆశా, ఎఎన్ఎం ల వద్ద తప్పనిసరిగా 100 ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలని వడ గాలులు వీస్తున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విస్తృతంగా ప్రచారం కల్పించాలని, అత్యవసరం ఉంటేనే ప్రజలు బయటకు రావాలని, బయటకు వస్తే అవసరమైన జాగ్రత్తలు పాటించాలని, వడ గాలులకు గురైన వ్యక్తులకు వెంటనే అవసరమైన ప్రధమ చికిత్స చేసి సమీప ఆసుపత్రికి తీసుకుని వెళ్లాలని అన్నారు.
ఈ కార్యక్రమం లో డిఆర్డిఎ పిడి జయదేవ్ ఆర్యా, జెడ్పీ సిఈఓ రమేష్, మిషన్ భగీరథ ఎస్సీ శ్రీనివాస్ చారి, డిఎంఆండ్ఎచ్ఓ డా. పుట్ల శ్రీనివాస్, డిఈఓ శ్రీనివాస్ రెడ్డి, డిపిఓ దేవకి దెవి తదితరులు పాల్గొన్నారు