ప్రత్తిపాడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నీరుకొండ
అక్షర విజేత, ఏలేశ్వరం : ప్రతిపాడు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఏలేశ్వరం మండలం యర్రవరం గ్రామానికి చెందిన నీరుకొండ సత్యనారాయణను ఆ పార్టీ ప్రకటించింది. ప్రస్తుతం సత్యనారాయణ భార్య నీరుకొండ రామకుమారి ఏలేశ్వరం జడ్పిటిసి గా ఉన్నారు. సత్యనారాయణ గతంలో యర్రవరం మేజర్ పంచాయతీ సర్పంచ్ గాను, జిల్లా సర్పంచుల సమైక్య ఉపాధ్యాక్షునిగాను, మండల సర్పంచుల సమైక్య అధ్యక్షునిగాను, ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగాను పని చేశారు.