నెంబర్ ప్లేట్ లేని వాహనాలపై పోలీసు నిఘా
అక్షర విజేత సిద్దిపేట్
పోలీస్ కమిషనర్ ఆదేశానుసారం మంగళవారం సిద్దిపేట పట్టణం హైదరాబాద్ రోడ్ కొత్త బస్టాండ్ ఎదురుగా నెంబర్ ప్లేటు లేని వాహనాలపై మరియు నెంబర్ ప్లేట్ సరిగా లేని వాహనాలపై త్రిబుల్ రైడింగ్, మైనర్ డ్రైవింగ్ స్పెషల్ డ్రైవ్ చేపట్టి సంబంధిత వాహనదారులకు, కౌన్సిలింగ్ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో డ్రంక్ అండ్ డ్రైవ్, కేసులు, వితౌట్ నెంబర్, నెంబర్ ప్లేట్ సరిగా లేని వాహనాలపై, మరియు మైనర్ డ్రైవింగ్ పై 58 కేసులు నమోదు చేయడం జరిగింది
నెంబర్ ప్లేట్ లేని 8 వాహనాలను సీజ్ చేయడం జరిగింది
ఈ కార్యక్రమంలో సిద్దిపేట ట్రాఫిక్ ఏసిపి సుమన్ కుమార్, ఇన్స్పెక్టర్ రామకృష్ణ మాట్లాడుతూ ప్రతి వాహనదారుడు రవాణా శాఖ ఉత్తర్వుల మేరకు నెంబర్ ప్లేట్ వాహనాలకు బిగించుకోవాలి, తరచుగా నెంబరు ప్లేట్ లేని వాహనాల చోదకులు వేగంగా నడుపుతూ తోటి వాహదారులను, పాదాచారులను, భయబ్రాంతులకు గురిచేస్తున్నందున నంబరు ప్లేట్లులేని వాహనాలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించామని తెలిపారు, మరియు మోటార్ సైకిల్ వాహనదారుడు తప్పకుండా హెల్మెట్ ధరించాలని, నెంబర్ ప్లేట్ లేని వాహనదారులు అజాగ్రత్తగా, అతివేగంగా వాహనాలు నడుపుతునందున్న ప్రమాదం జరిగే అవకాశం ఉందని, నెంబర్ ప్లేట్ నెంబర్ ప్లేట్ లేని వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు. మోటార్ సైకిల్ పై ముగ్గురు ప్రయాణించ వద్దని, వాహనం నడిపే ప్రతి వ్యక్తి డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని, ప్రతి ఒక్కరూ వాహనానికి సంబంధించిన డాక్యుమెంట్స్ వెంబడి ఉంచుకోవాలని త్రిబుల్ రైడింగ్, మరియు రాష్ డ్రైవింగ్ చేయవద్దని సూచించారు. మరియు మోటార్ సైకిల్ వాహన చోదకులు తప్పకుండా హెల్మెట్ ధరించాలని హెల్మెట్ బరువుగా కాకుండా బాధ్యతగా భావించాలని, హెల్మెట్ మా శాసనం కాదు మీ సంక్షేమం, హెల్మెట్ ఒక వస్తువు కాదు ప్రాణాన్ని కాపాడే ఆయుధం, రోడ్ చిన్నదైనా పెద్దదైన, పడితే ప్రమాదమే ఆదమరిస్తే విషాదమైన ఎక్కడైనా ఎప్పుడైనా చిన్నవారైన పెద్దవారైనా ప్రమాదం పొంచి ఉన్నదని ఎవరికెరుక అందుకే ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు ప్రజలందరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. రోడ్డు నిబంధనలు ట్రాఫిక్ నిబంధనలు పాటించి వాహనాలు నడపాలని సూచించారు. నెంబర్ సరిగ్గా లేని వాహనాల పై కొంతమంది నేరస్తులు బండ్లపైన వచ్చి దొంగతనాలు చేయడం, మరియు చట్టవ్యతిరేకమైన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. తరచుగా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ఐ వినయ్ సాగర్, ఏఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.