ఇంటి వద్దనే పింఛన్ అందించేలా చర్యలు తీసుకోవాలి.
………మండల టిడిపి నాయకులు
అక్షర విజేత,ప్యాపిలి:
తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఆదేశాల మేరకు ప్యాపిలి పట్టణంలోని స్థానిక ప్రజా పరిషత్ కార్యాలయ నందు టిడిపి మండల నాయకులు ఇంటి వద్దనే పింఛన్లు అందచేసేలా చర్యలు తీసుకోవాలని మంగళవారం ఎంపీడీవో సాయి మనోహర్ కి వినత పత్రం సమర్పించరు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఎన్నికల కమిషనర్ ఆదేశాల మేరకు వాలంటీర్ల ద్వారా పెన్షన్ పంపిణీ జరగకూడదని అధికారుల ద్వారానే జరగాలని చెప్పి నిర్ణయించారాని, దీనికి తెలుగుదేశం పార్టీకి ఎటువంటి సంబంధం లేదని, .తెలుగుదేశం పార్టీ వాళ్లు పిర్యాదు చేసి పెన్షన్ పంచకుండా అడ్డుకుంటున్నారని చెప్పి గ్రామాలలో వైసిపి నాయకులు ప్రచారం చేస్తున్నారని, ఆగ్రహం వ్యక్తం చేశారు. .ప్రభుత్వాన్ని నడపడానికి మీ చేతగాని తనాన్ని తెలుగుదేశం పార్టీ మీదకి నెట్టడం సమంజసం కాదని, ప్రతి ఒక్క పెన్షనర్ కి వారి ఇంటి వద్దకు వెళ్లి అధికారుల ద్వారా
వెంటనే పింఛన్ పంపిణీ కార్యక్రమం చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్యాపిలి మండల టిడిపి నాయకులు గండికోట రామసుబ్బయ్య, తొప్పేల శ్రీనివాసులు, రామ్మోహన్ యాదవ్, ఖాజాపీర్, గండికోట పెద్ద రామాంజనేయులు,నడిగడ్డ నాగేంద్ర, కొంగనపల్లె మధు, ప్రిన్సిపాల్ మధు, షరఫ్ హర్షవర్ధన్,పోదొడ్డి కదిరిప్ప, పోదొడ్డి పుల్లారెడ్డి, బీజెపి నాయకులు కెసి మద్దిలేటి, తదితరులు పాల్గొన్నారు.