మాలల మద్దతు కాంగ్రెస్ పార్టీ కే మద్దతు
మాల మహానాడు జాతీయ అధ్యక్షులు జి. చెన్నయ్య
అక్షర విజేత:అచ్చంపేట
దళితుల అభ్యున్నతి సాధికారత కోసం గతంలో కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్దితో కృషిచేసిందని ప్రస్తుతం రాష్ట్రం తో పాటు దేశంలో అధికారం లో ఉంటే దళిత,బలహీన వర్గాలకు మరింత మేలు జరిగే అవకాశం ఉన్నదని అందుకే కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతున్నానని మాల మహానాడు జాతీయ అధ్యక్షులు జి.చెన్నయ్య పేర్కొన్నారు.మంగళవారం నాడు అచ్చంపేట లోని ఆదర్శనగర్ మాలమహానాడు కార్యాలయం లో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాల ప్రజా సంఘాల జేఏసీ వర్కింగ్ చైర్మన్లు బూర్గుల వెంకటేశ్వర్లు, గోపోజు రమేష్,మన్నే శ్రీదర్ రావు లతో కలిసి చెన్నయ్య మాట్లాడుతూ.గతంలో ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం తెచ్చి చట్టబద్దత చేయటం,ఆహార భద్రతా చట్టం,భూపంపిణీ చట్టం,బ్యాంకుల జాతీయికరణ,పబ్లిక్ రంగ సంస్థల ఏర్పాటు లాంటి చట్టాల ద్వారా దళిత గిరిజన బలహీన వర్గాల అభివృద్ధి కి పాటుపడింది కాంగ్రెస్ పార్టీ అని.చెన్నయ్య తెలిపారు.ప్రస్తుతం అధికారం లో ఉన్న బిజెపి కేవలం కార్పొరేట్ సంస్థలకు కొమ్ము కాస్తు పబ్లిక్ రంగాన్ని మెత్తం ప్రైవేటు చేస్తూ దేశ సంపదను వారికి దొచిపెడుతుందని దేశంలో బిజెపి నీ గద్దె దించితెనే దళిత గిరిజనుల, బలహీన వర్గాలకు రక్షణ తో పాటు రిజ్వేషన్లు ఉంటాయని
దీనిని గమనించి దళిత బహుజనులంతా కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపి నాగర్ కర్నూల్ పార్లమెంటు అభ్యర్ధి మల్లు రవి ని అత్యధిక మెజార్టీ తో గెలిపించాలని చెన్నయ్య కోరారు.ఈ సమావేశం లో మాల మహానాడు నేతలు కుంద మల్లిఖార్జున్ కల్ముల బాలస్వామి,హారీచంద్ర, ఎనుపోతుల అనిల్,పెర్ముల రాజేష్,వేదవ్యాస వెంకటేష్,జి అంజి,వెంకటేష్,అభి,మల్లేష్, స్థానిక నేతలు పాల్గొన్నారు,