చిగురుమామిడి లో కేంద్ర బలగాలతో కవాతు నిర్వహించిన పోలీసులు
అక్షర విజేత: చిగురుమామిడి
కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల కేంద్రం లో పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా స్థానిక ఎస్.ఐ బండి రాజేష్ ఆధ్వర్యంలో కేంద్ర బలగాలతో కవాతు నిర్వహించారు. ఈ సందర్బంగా ఎస్.ఐ బండి రాజేష్ మాట్లడుతూ ప్రశాంతమైన వాతావరణం లో ఎన్నికలు జరగలన్నరు. మండలం లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులకు మండల ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఎన్నికల నియమావళి ప్రకారం ప్రజలు నడుచుకోవాలన్నరు.చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలు చేపడితే కేసులు నమోదు చేస్తామని తెలిపారు