బాబు షూరిటీ – భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొన్న టిడిపి
జాతీయ కోశాధికారి & జగ్గయ్యపేట నియోజకవర్గం టిడిపి,బిజెపి,జనసేన పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ శ్రీరాం రాజగోపాల్ తాతయ్య గారు
జగ్గయ్యపేట పట్టణంలో 30వ వార్డు ఎన్ఎస్పి క్వార్టర్స్ వద్ద నుండి బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా స్థానిక తెదేపా నేతలతో కలిసి జగ్గయ్యపేట నియోజకవర్గం టిడిపి,బిజెపి,జనసేన పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ శ్రీరాం రాజగోపాల్ తాతయ్య గారు పాల్గొని ఇంటింటికి తిరుగుతూ సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరిస్తూ సూపర్ సిక్స్ క్యాలెండర్ ను అందజేశారు.
ఈ కార్యక్రమంలో వివిధ హోదాలలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.