కొండపల్లి మున్సిపాలిటీలో టీడీపీ ఉమ్మడి అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్ పర్యటన.
బీజేపీ, జనసేన పార్టీ, టీడీపీ కూటమి అఖండ విజయానికి కృషిచేయాలని పిలుపు.
అక్షర విజేత మైలవరం నియోజకవర్గం ప్రతినిధి
మైలవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి, స్థానిక ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ మంగళవారం కొండపల్లి మున్సిపాలిటీలో విస్తృతంగా పర్యటించారు. మండుటెండలో సైతం స్వేదం చిందిస్తూ కెపి పర్యటన కొనసాగింది. పలువురు నాయకుల ఇళ్ళకు వెళ్లి వారిని నేరుగా కలిశారు. వారి ఆత్మీయంగా పలకరిస్తూ, వారి యోగక్షేమాలు తెలుసుకుంటూ తెలుగుదేశం పార్టీలో మరింత చురుగ్గా ఉండి రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ, జనసేన, తెలుగుదేశం కూటమి అఖండ విజయానికి ప్రతి ఒక్కరూ యుద్ధంలో సైనికుల్లో పనిచేయాలని పిలుపునిచ్చారు.కొండపల్లి మున్సిపాలిటీలో బూత్ కమిటీ కన్వీనర్ బసవ ఉమామహేశ్వరరావు ని, మాజీ వార్డు సభ్యులు షేక్ ఖాజా , మాజీ వార్డు సభ్యులు వేల్పుకొండ శ్రీనివాసరావు , ఏఎంసీ మాజీ డైరెక్టర్ యల్లగందుల రాజశేఖర్, మాజీ ఎంపీటీసీ సభ్యులు మహమ్మద్ హైదర్ అలీ , ఎస్.సి సెల్ విభాగం నాయకులు కొత్తపల్లి ప్రకాష్, మాజీ వార్డు సభ్యురాలు మల్లెల పార్వతి , మాజీ సర్పంచి వెనిగళ్ళ అమ్మాజీ, మురళి మోహన్ గారిని తదితరులను కలిశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ని వారందరూ సాదరంగా ఆహ్వానించి వారి, వారి అభిమానాన్ని చాటుకున్నారు. శాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు. యువత కేపీ తో సెల్ఫీలు దిగేందుకు ఎగబడ్డారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.