ఎన్నికల విధులలో అనుమానాలు ఉంటే నివృత్తి చేసుకోవాలి
అక్షర విజేత అదిలాబాద్ ప్రతినిధి:-
కొమురంభీం జిల్లా కాగజ్ నగర్ పట్టణంలోని వివేకానంద డిగ్రీ కళాశాలలో మంగళవారం పోలింగ్ అధికారులు సహాయ పోలింగ్ అధికారులకు ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ వేంకటేశ్ దౌత్రే అదనపు కలెక్టర్ దీపక్ తివారి ఆర్డీఒ సురేష్ తో కలిసి హాజరయ్యారు కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికలలో విధులు నిర్వహించే వారు బాధ్యతాయుతంగా ఉండాలని ఏమైనా అనుమానాలు ఉన్నట్లయితే శిక్షణ తరగతులలో నివృత్తి చేసుకోవాలని అన్నారు