జయహో జనతా జవాన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆర్మీ జవాన్ కు స్వాగతం
సైనికుడిగా దేశానికి సేవ చేయడం తృప్తినిచ్చింది
జవాన్ అడ్డగుంట మల్లయ్య
అక్షర విజేత,చొప్పదండి;
ఉమ్మడి కరీంనగర్ జిల్లా జయహో జనత జవాన్ ఫౌండేషన్ ఫౌండేషన్ గౌరవాధ్యక్షులు అయినటువంటి అడ్డగుంట మల్లయ్య ఆర్మీ జవాన్ గా సేవలందించి మార్చి 31 న పదవి విరమణ చేశారు మంగళవారం రోజున స్వంత గ్రామమైనటువంటి చొప్పదండి మండలం వెదురుగట్ట గ్రామం నకు వస్తున్న తరుణంలో జయహో జనతా జవాన్
ఫౌండేషన్ సభ్యులు ఆయనకు ఘన స్వాగతం పలికి పూలమాలలతో ఘన సన్మానం చేశారు. అడ్డగుంట మల్లయ్య భారత సైన్యంలో 25 సంవత్సరాలకు పైగా దేశానికి సేవలు అందించిన సైనికుడు, ఆసేతు హిమాచలంను రక్షిస్తూ, ఉగ్రవాదుల ఏరివేతలో వెన్ను చూపని వీరత్వం ప్రదర్శించిన సైనికుడు అని కొనియాడారు. దేశానికి సైనికుడిగా సేవ చేయడం తృప్తినిచ్చింది అన్నారు