ఎమ్మార్పీఎస్ నాయకులు దేవరకొండ వెంకటేశ్వర్లు మాదిగ మృతి
అక్షర విజేత ఎర్రుపాలెం
జాతి కోసం ఏబిసిడి వర్గీకరణ సాధనకోసం పోలీసు లాటిలకు వెన్ను చూపించి,జాతి కోసం 30 సంవత్సరాలు తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడుదేవరకొండ వెంకటేశ్వర్లు మాదిగ సోమవారం రాత్రి అనారోగ్యంతో తమ స్వగృహంలో కన్నుమూశారు. మండల కేంద్రమైన ఎర్రుపాలెం ఎస్సీ కాలనీకి చెందిన దేవరకొండ వెంకటేశ్వర్లు మాదిగకొంతకాలంగాఅనారోగ్యంతోబాధపడుతూతుదిశ్వాస విడిచారు.వారి మరణ వార్త తెలుసుకున్నఎమ్మార్పీఎస్ నాయకులు సునీల్ మాదిగ పార్థివదేహాన్ని సందర్శించి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.జాతి ముద్దుబిడ్డ రాజీలేని పోరాటం చేసిన మహనీయుడు మన డివి అన్నా అని ఆయన లేని లోటు ఎంఆర్పిఎస్ కు తీరనీలోటని ఆవేదన చెందారు.ఎక్కడ ఎలాంటి లాభపేక్ష ఆశించకుండా నిరంతరం జాతి కోసం పోరు సలిపిన ఘనుడని కొనియాడారు .అదేవిధంగా కాంగ్రెస్ నాయకులు డిసిసిబి డైరెక్టర్ ఐలూరు వెంకటేశ్వర్ రెడ్డి, కాంగ్రెస్ జిల్లా నాయకులు డాక్టర్ కోటా రాంబాబు, పూలమాలలు వేసినివాళులర్పించి కుటుంబానికి ఓదార్పును,సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలోబొబ్బిలిపాటి బాబురావు, కూరపాటి సునీల్, చిరంజీవి, మేకల రమేష్ ,స్థానిక నాయకులు కంచర్లవెంకటనరసయ్య,సూరంశెట్టి రాజేష్, కడియం శ్రీనివాసరావు, పార్టీలకు అతీతంగా మంగళవారం అంతిమయాత్రలో పెద్ద ఎత్తున బంధువులు స్నేహితులు గ్రామస్తులు అభిమానులు ఎంఆర్పిఎస్ నాయకులు పాల్గొన్నారు.కడసారిగా ఎమ్మార్పీఎస్ నాయకులు దేవరకొండ వెంకటేశ్వర్లు మాదిగ పాడేమోసి జాతి బిడ్డ రుణం తీర్చుకున్నామన్నారు.