గజ్వేల్ సభ కు భారీగా తరలి వెళ్ళిన బిఆర్ఎస్ కార్యకర్తలు
అక్షరవిజేత,కొండపాక :
మెదక్ పార్లమెంట్ ఎన్నికలలో బీఆర్ఎస్ అభ్యర్థి వెంకటరామిరెడ్డి నీ అత్యధిక మెజారిటీతో గెలుపొందిస్తామని సిద్దిపేట జిల్లా కొండపాక మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు నూనె కుమార్ యాదవ్ అన్నారు. గజ్వేల్లో జరిగే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి కార్యకర్తల తో బయలుదేరి వెళ్లారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి వెంకటరామిరెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు ప్రతి కార్యకర్త సైనికుల పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు.