సర్వాయి పాపన్న గౌడ్ ఆశయాల సాధనకై రాష్ట్ర ప్రభుత్వం కృషి
అక్షర విజేత: చిగురుమామిడి
సర్వాయి పాపన్న గౌడ్ ఆశయ సాధనకై రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తామని జడ్పీటీసీ గీకురు రవీందర్ అన్నారు. మంగళవారం చిగురుమామిడి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బహుజన పోరాటయోధుడు సర్వాయి పాపన్న గౌడ్ 314 వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. మండల కేంద్రంలోని సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా జెడ్పిటిసి గీకురు రవీందర్, మండల పార్టీ అధ్యక్షుడు కంది తిరుపతి రెడ్డి లు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సర్వాయి పాపన్న గౌడ్ ఆశయాలకు ప్రాధాన్యత ఇస్తూ పనిచేస్తుందని తెలిపారు. బడుగుల రాజ్యానికి సర్వాయి పాపన్న గౌడ్ జీవితం ఒక స్ఫూర్తిదాయకమని ఆయన ఆశల్ని సాధించే దిశగా ప్రతి ఒక్కరు పనిచేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు చిట్టిమల్ల రవీందర్, దాసరి ప్రవీణ్ కుమార్,పూదరి వేణు, బొమ్మగని వెంకటేష్,అందే సురేష్ ,కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.