వైసిపి ఎంపి అభ్యర్థి బూడి ముత్యాల నాయుడును అభినందించిన పేపకాయల అప్పారావు
అక్షరవిజేత,పాయకరావుపేట.
అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గ వైసిపి అభ్యర్థి బూడి ముత్యాల నాయుడును అరట్లకోట గ్రామ వైసిపి సీనియర్ నాయకులు, గ్రామ సచివాలయ కన్వీనర్, గ్రామ పంచాయతీ ఆరవ వార్డు సభ్యులు పేపకాయల అప్పారావు అభినందించారు. పట్టణంలోని ఒక ఫంక్షన్ హాలులో జిల్లా వ్యవసాయ సలహా మండలి ఛైర్మన్, పార్టీ మండల అధ్యక్షులు చిక్కాల రామారావు ఆధ్వర్యంలో పార్టీ ఎంపి అభ్యర్థి బూడి ముత్యాల నాయుడుతో పార్టీ నాయకులు, కార్యకర్తల పరిచయ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పేపకాయల అప్పారావు సభా వేదికపై ఉన్న బూడి ముత్యాల నాయుడు వద్దకు వెళ్లి అభినందనలు తెలియజేశారు. మే 13 న జరుగబోయే అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో పాయకరావుపేట ఎమ్మెల్యేగా కంబాల జోగులు, అనకాపల్లి ఎంపిగా మీరు ఘన విజయం సాధించడం ఖాయం బూడి ముత్యాల నాయుడుకు పేపకాయల అప్పారావు చెప్పారు. ఈ సంధర్భంగా మండలంలోని పలువురు సర్పంచులు, ఎంపిటిసిలు, పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్ష, కార్యదర్శిలు, పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలను ఎంపి అభ్యర్థి బూడి ముత్యాల నాయుడుకు చిక్కాల రామారావు పరిచయం చేశారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు గొల్ల బాబూరావు, పార్టీ జిల్లా అధ్యక్షులు బొడ్డేడ ప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ అంగూరి లక్ష్మీ శివకుమారి, పార్టీ మాజీ మండల అధ్యక్షుడు ధనిశెట్టి బాబూరావు, పార్టీ ప్రచార పబ్లిక్ వింగ్ జిల్లా అధ్యక్షులు దగ్గుపల్లి సాయిబాబా, రాష్ట్ర మత్స్యకార కార్పొరేషన్ డైరెక్టర్ చోడిపిల్లి శ్రీనివాసరావు, జడ్పిటిసి లంక సూర్యనారాయణ, ఎంపిపి ఇసరపు తాతారావు, పాయకరావుపేట పంచాయతీ ఉప సర్పంచ్ జగతా శ్రీను, పాయకరావుపేట పిఎసిఎస్ చైర్మన్ దేవవరపు రాజేష్ ఖన్నా, నామవరం పిఎసిఎస్ ఛైర్ పర్సన్ కె సుందర లత, పార్టీ పట్టణ అధ్యక్షుడు ధనిశెట్టి మహేష్ (బాబీ), పార్టీ సోషల్ మీడియా నియోజకవర్గ కన్వీనర్ కొంకిపూడి రామకృష్ణ , పెద్ద సంఖ్యలో పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.