మహబూబాబాద్ పార్లమెంట్ గెలుపుని నిర్ణయించేది యాదవులే.
అక్షరవిజేత మహబూబాబాద్
తెలంగాణ యాదవ మహాసభ మహబూబాబాద్ పార్లమెంటరి సమావేశం మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు సూత్రపు రాజు యాదవ్ అధ్యక్షతన జరిగింది.ఈ సమావేశం లో ములుగు,నర్సంపేట వరంగల్,హన్మకొండ మహబూబాబాద్,డోర్నకల్ ఇల్లందు,భద్రాచలం పినపాక నియోజకవర్గ అధ్యక్షులు జిల్లా అధ్యక్షులు ఆధ్వర్యంలో ముఖ్య నాయకుల సమావేశంలో ముఖ్య అతిథిలుగా తెలంగాణ యాదవ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు కురాకుల నాగభూషణం యాదవ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యేశబోయిన సాంబయ్య యాదవ్ హాజరై మాట్లాడుతు మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలో సుమారు మూడు లక్షల యాభైవేల జనాభా యాదవులు ఉన్నారు.మన ఐక్యతతో మన జాతికి మన హక్కులకు మద్దతు తెలిపే పార్లమెంట్ సభ్యులను గెలిపించుకుందాం.నియోజక వర్గం అధ్యక్షులు కలిసి కట్టుగా పని చేసి గెలుపులో మన పాత్రను కొట్టవచ్చినట్లు చూపించాలి మన జనంతోనే పార్లమెంట్ గెలుపు నిర్ణఇద్దాం అని తెలిపారు.ఈ కార్య క్రమంలో వరంగల్ జిల్లా అధ్యక్షులు బోల్ల చంద్ర మౌళి యాదవ్,హన్మకొండ జిల్లావర్కింగ్ ప్రెసిడెంట్ దేవన బోయిన కుమార్ యాదవ్ ములుగు జిల్లా అధ్యక్షులు చందర్ రాజ్ యాదవ్ భద్రాచలం జిల్లా అధ్యక్షులు సాగర్ యాదవ్ పినపాక నియోజక వర్గం అధ్యక్షులు శ్రీనివాస్ యాదవ్ అనందయ్య యాదవ్ వీరితో పాటు ముఖ్య నాయకుల పాల్గొన్నారు.