రాష్ట్రస్థాయి జిజ్ఞాస పోటీలకు బెల్లంపల్లి డిగ్రీ విద్యార్థులు
అక్షర విజేత, మంచిర్యాల ప్రతినిధి:
బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు రాష్ట్రస్థాయి జిజ్ఞాస పోటీలకు ఎంపికయ్యారని ప్రిన్సిపాల్ డాక్టర్ టీ ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. కళాశాల నుంచి ఒకేసారి నాలుగు సబ్జెక్టుల నుంచి నాలుగు బృందాల విద్యార్థులు ఆయా సూపర్వైజర్ల ఆధ్వర్యంలో సమర్పించిన పరిశోధన పత్రాలకు రాష్ట్రస్థాయిలో పోటీపడే అవకాశం దక్కిందని వివరించారు. బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుంచి జువాలజీ డిపార్ట్మెంట్ తరఫున అసిస్టెంట్ ప్రొఫెసర్ పీ శ్రీలత ఆధ్వర్యంలో ఒక విద్యార్థి బృందం, కెమిస్ట్రీ విభాగం నుంచి అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ బి ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో ఒక బృందం, ఎకనామిక్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆధ్వర్యంలో ఒక బృందం, మాథెమాటిక్స్ అధ్యాపకులు జి బానేష్ ఆధ్వర్యంలో మరొక బృందం మొత్తం నాలుగు బృందాలు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యాయి. ఈ మేరకు ఈ నాలుగు బృందాలు నేడు (బుధవారం ) హైదరాబాదులోని రెండు చోట్ల జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొననున్నాయి. తాము ఎంచుకున్న పరిశోధన అంశాల పైన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నాయి. ఈ సందర్భంగా మంగళవారం ప్రిన్సిపల్ డాక్టర్ టి.ఎస్ ప్రవీణ్ కుమార్ ఈ నాలుగు బృందాలను అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్రస్థాయిలో మంచి ప్రతిభ కనబరిచి బహుమతులు సాధించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఈ నాలుగు సబ్జెక్టుల సూపర్వైజర్లను మరియు విద్యార్థిని విద్యార్థులను కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ టి ఎస్ ప్రవీణ్ కుమార్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది అభినందించారు.