వృద్దులకు భోజనాలు, పేదలకు చీరలు, చిన్నారులకు విద్యాసామాగ్రి బిస్కెట్స్ అందజేత…
*అక్షర విజేత, భీమవరం
జెపి పౌండేషన్ వ్యవస్థాపకులు, వీరవాసరం జెడ్పీటీసీ గుండా జయప్రకాష్ నాయుడు పుట్టినరోజు వేడుకలను జెపి యూత్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలతో ఘనంగా నిర్వహించారు. ముందుగా భీమవరం శ్రీమావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానంలోను, నందమూరి గరువు ఆంజనేయస్వామి వారి దేవస్థానంలో పూజా కార్యక్రమాలు, శ్రీవెంకటేశ్వర బదరి పాఠశాలలో కేక్ కటింగ్, చిన్నారులకు బిస్కెట్స్, చినఅమిరంలోని శ్రీస్వామి యోగేశ్వరానందగిరి విశ్వశాంతి వృద్ధుల ఆశ్రమంలో అన్నదానం, పెన్నాడ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో విద్యా సామాగ్రి పంపిణీ, చినఅమిరం ఇమ్మానియేలు చిల్డ్రన్స్ హాస్టల్లో అన్నదానం, భీమవరం రైల్వే జంక్షన్ దగ్గర అన్నదానం, భీమవరం – గునుపూడి ఇందిరమ్మ కాలనీలో 100 మందికి చీరల పంపిణీ చేశారు. చిరు పవన్ తేజం సేవా సమితి అధ్యక్షుడు, న్యాయవాదులు ఉండపల్లి రమేష్ నాయుడు, కామాన రామకృష్ణ మాట్లాడుతూ జయప్రకాష్ మంచి మనసున్న వ్యక్తి అని, పలువురికి ఆదర్శంగా నిలుస్తూ సేవా చేసే జయప్రకాష్ మరెన్నో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని అన్నారు. రానున్న రోజుల్లో మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని అన్నారు. గుండా రామకృష్ణ, రాయవరపు శ్రీనివాస్ రావు,
మెగా ఫ్యాన్స్ పట్టణ అధ్యక్షులు చల్లా రాము మాట్లాడుతూ జయప్రకాష్ పుట్టినరోజు వేడుకలను సేవా కార్యక్రమాలతో చేపట్టడం అభినందనీయమని, వృద్దులకు భోజనాలు, పేదలకు చీరలు, చిన్నారులకు విద్యాసామాగ్రి, బిస్కెట్స్ అందించారని అన్నారు. జెపి యూత్ సేవలను కొనియాడారు. కార్యక్రమంలో కొప్పినిడి బాబీ, చింతా లక్ష్మణ్, అగ్నికుల క్షత్రియ యూత్ జిల్లా అధ్యక్షుడు నాగిడి శ్యామ్, గంధం భరత్, వీరన్న, జడా చిన్నా, కుంపల శ్రీను, గంటా ప్రదీప్, ఏసు తదితరులు పాల్గొన్నారు.