గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ఇద్దరు నిందితుల అరెస్ట్
అక్షర విజేత, మంచిర్యాల ప్రతినిధి
గత కొద్ది కాలంగా బెల్లంపల్లి పరిసర ప్రాంతాల్లో వేరే ప్రాంతాల నుండి గంజాయి అక్రమ రవాణా చేస్తు విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించినట్లు మంచిర్యాల డీసీపీ అశోక్ కుమార్ తెలిపారు. బెల్లంపల్లి పట్టణానికి చెందిన నలుగురు యువకులు లింగాల యశ్వంత్, తోట మనిదీప్, నవీద్, ముజ్జు అనే వారు చెడు అలవాట్లకి అలవాటు పడి గత కొద్ది రోజులుగా మహారాష్ట్ర లోని చంద్రపూర్, బల్లర్శా పట్టననలలో గుర్తు తెలియని వ్యక్తుల వద్ద నుండి పెద్ద ఎత్తున గంజాయి తక్కువ ధరకి కొని తీసుకు వచ్చి బెల్లంపల్లి లోని యువతకి ఎక్కువ ధరకి అమ్ముకుని లాభాన్ని పొందుతూ జీవితాన్ని విలాసవంతంగా గడపడానికి అలవాటు పడినారు. అదే క్రమంలో గత నెల మార్చ్ 24 న చంద్రపూర్ కి నలుగురు కలసి వెళ్లి గంజాయి కొని తీసుకుని వచ్చి, యశ్వంత్, మనిదీప్ లు 1100 గ్రాముల గంజాయి అమ్మడానికి కొత్త బస్ స్టాండ్ చేరువలో కి ఒక కవర్ లో పట్టుకుని రాగ పెట్రోలింగ్ చేసే సిబ్బంది యస్. ఐ రమేష్ నిందితులని పట్టుకున్నారు. వారి పై కేసు నమోద్ చేసి రిమాండ్ కి తరలించానైనది. ఈసందర్బంగా మంచిర్యాల డీసీపీ మాట్లాడుతూ యువత చెడు వ్యసనాలకి ఆకర్షితులు కాకుండా సత్ప్రవర్తన కలిగి బంగారు భవిత కోసం శ్రమించాలని, సంగఘవిద్రోహ చర్యల పై, చట్టవిరుద్ధ కార్యకలాపాలపై పొలిసు వారి నిఘా ఎల్లప్పుడూ ఉంటుంది. చట్ట వ్యతిరేఖ పనులు చేసే వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు అని చట్ట పరంగా కఠిన చెర్యలు తీసుకోబడును అని డీసీపీ హెచ్చరించినారు.