పత్రికా ప్రకటన
భీమవరం: ఏప్రిల్ 2, 2024.

*భవిష్య ఓటర్లు తీసుకోవాలని స్వీప్ నోడల్ అధికారి జి సిహెచ్ ప్రభాకర్
అక్షర విజేత, భీమవరం
స్థానిక పొట్టి శ్రీరాములు మునిసిపల్ బాలికల ఉన్నత పాఠశాలలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మంగళవారం నాడు ప్రధానోపాధ్యాయురాలు జె సుధారాణి అధ్యక్షత ‘భవిష్య ఓటర్ల అవగాహన’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమమునకు ముఖ్యఅతిథిగా పాల్గొన్న జిల్లా స్వీప్ నోడల్ అధికారి జి సిహెచ్ ప్రభాకర్ మాట్లాడుతూ భవిష్య ఓటర్లు వారి కుటుంబ సభ్యులకు స్థానికులకు లకు విషయాలను చేర్చడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమన్నారు. ముఖ్యముగా తమ తల్లిదండ్రుల చేత బంధుమిత్రుల చేత ఓటు వేసే బాధ్యతను భవిష్య ఓటర్లు తీసుకోవాలన్నారు. అంతే కాకుండా వివిధ రకములైన యాప్ ద్వారా ఓటర్లు హెల్ప్ లైన్ యాప్ యొక్క పనితీరు ను వివరించారు. భవిష్య ఓటర్ల ద్వారా అనేక విషయాలను వారి ఇంటికి చేర్చడమే ఈ కార్యక్రమం లక్ష్యం అని పేర్కొన్నారు. ముఖ్యంగా ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా తమ తల్లదండ్రుల చేత, తమ బంధుమిత్రుల చేత ఓటు వేయించే బాధ్యతను భవిష్య ఓటర్లు తీసుకోవాలని సూచించారు. అంతేకాకుండా వివిధ రకాలైన యాప్ లు, ఓటర్లు హెల్ప్ లైన్ యాప్ యొక్క పని తీరును వివరించారు. ఈ యాప్ ను విద్యార్థులు తమ మొబైల్స్ లో డౌన్లోడ్ చేసుకుంటే వారికి ఓటింగ్ కి సంభందించిన అన్ని విషయాలు పొందుపరిచి ఉన్నాయన్నారు. ఈ యాప్ ద్వారా అవసరమైన వారు వాటర్ కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ అవకాశమును కల్పించిందని తెలిపారు. 2019 ఎలక్షన్ లో పశ్చిమ గోదావరి జిల్లా ఓటింగ్ 82,శాతం గా ఉండగా దాన్ని 96,శాతానికి పెంచే విధంగా లక్ష్యం పెట్టుకున్నామన్నారు. ఈ లక్ష్యాన్ని సాధించడానికి భవిష్య ఓటర్లు ఎలక్ట్రో లిటర్ సి క్లబ్ కు సహకరించాలన్నారు.
అనంతరం విద్యార్థులుతో స్థానిక వీరమ్మ చెరువు వరకు ఓటుకు నోటు వద్దే వద్దు, ‘చూనావ్ కా పర్వ్ – దేశ్ కా గర్వ్’ నినాదాలతో స్థానిక వీరమ్మ పార్కు వద్ద మానవహారం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో స్వీప్ టీమ్ సభ్యులు చరణ్ తేజ్, సప్ప శ్రీనివాస్, ఉపాధ్యాయులు విద్యార్థినిలు తదితరులు పాల్గొన్నారు.