దళితులకు అన్యాయం చేసిన కడియం కావ్య ను ఓడిస్తాము-
విధ్యార్థి సంఘ నాయకులు మందా నరేష్,
బొట్ల మనోహర్
అక్షర విజేత వరంగల్
కాకతీయ యూనివర్సిటీ మొదటి గేట్ వద్ద అంబెడ్కర్ విధ్యార్థి సమైక్య, బహుజన్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మాజీ మంత్రి కడియం శ్రీహరి దిష్టిబొమ్మ దహనం చేశారు.ఈ సందర్భంగా ఏ.బి.యస్.ఫ్ ఉమ్మడి వరంగల్ జిల్లా మందా నరేష్ బి.యస్.ఫ్ కె.యూ ఇంచార్జి,హన్మకొండ జిల్లా అధ్యక్షులు బొట్ల మనోహర్ మాట్లాడుతూ దళిత నాయకత్వాన్ని అణచి వేస్తూ వారి త్యాగాల పునాదుల మీద వివిధ పార్టీల నుండి టికెట్ తెచ్చుకుంటూ గెలుస్తూ పదవులు అనుభవిస్తూ అవకాశవాద రాజకీయాలు చేస్తూ పబ్బం గడుపుతున్నారని అన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో దళిత జాతి నాయకులను ఎదగకుండా అణగదొక్కిన ఏకైక వ్యక్తి కడియం శ్రీహరి అని ఏ పార్టీలో ఉన్న ఆ పార్టీలో ఉన్న దళితులను వారిని భూస్థాపితం చేయడమే లక్ష్యంగా పెట్టుకొని పైకి మాత్రం నేను ఒక దళితున్ని అని చెప్పుకుంటూ పబ్బం గడుపుతున్న కడియం శ్రీహరి రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో వాళ్ళ కుమార్తె కడియం కావ్య ను చిత్తుచిత్తుగా ఓడిస్తామని హెచ్చరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ వరంగల్ పార్లమెంట్ టికెట్ విషయంలో పునరాలోచించి వెంటనే వరంగల్ పార్లమెంటు సీటు ను మాదిగలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఒక పార్టీ నుండి గెలిచి మరొక పార్టీ పోయిన కడియం శ్రీహరి సిగ్గుమాలిన నీతిమాలిన దిక్కుమాలిన రాజకీయాలు చేస్తూ నువ్వు వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తన నిజాయితీ నిరూపించుకోవాలని అన్నారు. దళిత ద్రోహి కడియం శ్రీవారి అని అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యా సంఘ నాయకులు మచ్చ పవన్కళ్యాణ్, కుమ్మరి శ్రీనాథ్, జూపాక చరణ్ ఎల్తురి సాయికుమార్,ఓదెల అరిస్టాటిల్, జీవన్,వివేక్ తదితరులు పాల్గొన్నారు