బహుజనులు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయాలను కొనసాగించాలి.
జిల్లా పరిషత్ చైర్పర్సన్ సరిత
అక్షర విజేత జోగులాంబ గద్వాల ప్రతినిధి
బహుజన రాజ్యాధికార స్థాపన కొరకు నిరంతరం పోరాడిన పోరాటయోధుడు, అరాచకాలను ఎదిరించి, తెలంగాణ ప్రాంతాన్ని కాపాడిన మహా వ్యక్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని జడ్పీ చైర్ పర్సన్ సరిత అన్నారు. మంగళవారం 314వ వర్ధంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని జెడ్పీ నివాసంలో గౌడ కుల సంఘ నాయకులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సబ్బండ వర్గాలను ఏకం చేసి రాజ్యాధికారాన్ని స్థాపించిన వీరుడనీ, గౌడ్ ఆశయాలను నెరవేర్చడానికి ఆయన అడుగుజాడల్లో నడుచుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు కౌన్సిలర్ నరహరి గౌడ్, పాతపాలెం ఆనంద్ గౌడ్, గోనుపాడు శ్రీనివాస్ గౌడ్, గోవింద్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.