నరసింహస్వామి ఆలయంలో ధ్వజస్తంభం ఏర్పాటు
అక్షర,విజేత నిజామాబాద్ ప్రతినిధి:
ధర్పల్లి మండలం లోని శ్రీ మద్దుల్ల లక్ష్మి నరసింహ స్వామి ఆలయ ఆవరణంలో గోవింద్ పల్లి గ్రామానికి చెందిన కర్రోల్ల బొర్రన్న ధ్వజస్తంభం కొనివ్వడం జరిగింది. మరియు నరసింహ స్వామి భక్తులందరికీ కర్రోల్ల బొర్రన్న అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసారు. దీనికి కృతజ్ఞతా భావాన్ని వ్యక్తపరుస్తూ శ్రీలక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని వారి కుటుంబ సభ్యులందరికీ క్షేమ, స్థైర్య ఆయురారోగ్యాలతో సిద్ధించాలని, సుఖ సంతోషాలు చేకూర్చాలని మనస్ఫూర్తిగా స్వామి వారిని కోరుకుంటు వీరికి ఆలయ కమిటీ తరుపున ప్రత్యేక ధన్యవాదములు తెలియజేసారు.