ప్రజలు బిజెపి వైపే ప్రజా ఆశీర్వాద యాత్ర
మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపి పార్టీ విజయం తథ్యం
దేశ ప్రజలు మోడీ నాయకత్వాన్ని ఉన్నారు
అక్షర విజేత, తాండూర్
తాండూర్ నియోజకవర్గం యాలాల్ మండలం సోమవారం మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ప్రజా ఆశీర్వాద యాత్ర పలు గ్రామాల్లో కొనసాగించారు.
దేశానికి మోడీ నాయకత్వం శ్రీరామరక్షాన్ని దేశంలో మూడో సారి ప్రధాని అయ్యేది నరేంద్రమోడీయే అని, లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ ఎదురులేని విజయం సాధించడం ఖాయమని ఆ పార్టీ నాయకులు, చేవేళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
దేశ ప్రజలు మోడీ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని భారత దేశ గుర్తింపును ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన మోడీని ప్రజలు మరోసారి ఆశీర్వదించాలని కోరారు
ఈ పార్లమెంట్ ఎన్నికలనేపథ్యంలో బీజేపీ అభ్యర్థి విశ్వేశ్వర్ రెడ్డి ప్రజా ఆశీర్వాద యాత్ర విజయవంతంగా కొనసాగింది. మండలంలోని రాస్నం, రాఘవపూర్, పగిడ్యాల్, కోకట్, లక్ష్మీనారాయణ పూర్, అగ్గనూర్ తదితర గ్రామాల్లో ప్రజా ఆశీర్వాద యాత్ర కొనసాగింది.
యాత్రలో కొండా విశ్వేశ్వర్ రెడ్డి అందరిని పలకరిస్తూ బీజేపీ ప్రభుత్వాన్ని ఆదరించాలని కోరారు. కొండా పిలుపుకు ప్రతి ఒక్కరు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ
దేశంలో బీజేపీని గెలిపిస్తే అభివృద్ధి, సంక్షేమాన్ని సాధించుకోవచ్చన్నారు. మూడో సారి దేశంలో నరేంద్ర మోడి ప్రధాని కావడం ఖాయమన్నారు. అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటి చేస్తున్న తనకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.