* రంజాన్ మాసం ముస్లిం సోదరులకు పవిత్రమైనది
చిగుళ్లపల్లి గ్రౌండ్ లో దావత్ -ఈ -ఇఫ్తార్
* అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్
అక్షరవిజేత, వికారాబాద్ ప్రతినిధి
ముస్లిం మాసం ముస్లిం సోదరులకు పవిత్రమైనదని వికారాబాద్ ఎమ్మెల్యే, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పేర్కొన్నారు. సోమవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని చిగుళ్ల పల్లి గ్రౌండ్స్ లో తెలంగాణ శాసనసభ సభాపతి, వికారాబాద్ శాసనసభ్యులు గడ్డం ప్రసాద్ కుమార్ ఆధ్వర్యంలో వికారాబాద్ నియోజకవర్గ ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది. గత కొన్ని సంవత్సరాలుగా ఆనవాయితగా వస్తున్న ఈ కార్యక్రమానికి నియోజకవర్గం నుండి అన్ని మండలాలు, గ్రామాల నుండి పెద్ద ఎత్తున ముస్లిం సోదరులు పాల్గొని తమ ఉపవాస దీక్షను విరమించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా నవాబ్ మహమూద్ ఆలం ఖాన్, ముజాఇద్ ఆలం ఖాన్,మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ అజమతుల్లా ఖాన్, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, ఫహీం భాయ్, ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యేలు రాంమోహన్ రెడ్డి, మనోహర్ రెడ్డి, నాయకులు సుధాకర్ రెడ్డి, కిషన్ నాయక్,వహీద్, వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్,అయూబ్ అన్సారీ, ముక్తార్ షరీఫ్,వెంకట్ రెడ్డి, పరుశరామ్ నాయక్,శ్రీనివాస్ ముదిరాజ్, రఘుపతి రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, అసిఫ్, సర్ఫరాజ్, జాఫర్, కరీం, రహీం తదితరులు పాల్గొన్నారు.