ఇఫ్తార్ లు హిందూ, ముస్లింల మధ్య సోదరభావాన్ని పెంపోందిస్తాయి
అక్షర విజేత, మంచిర్యాల ప్రతినిధి:
రంజాన్ పవిత్ర మాసంలో ఇఫ్తార్ విందులు హిందూ, ముస్లింల మధ్య సోదరభావాన్ని పెంపొందిస్తాయని బెల్లంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గడ్డం వినోద్, చెన్నూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామిలు అన్నారు. బెల్లంపల్లి పట్టణంలోని స్థానిక ప్రగతి కళాశాల ఆవరణలో మైనార్టీ నాయకుడు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో సోమవారం ఎమ్మెల్యేలు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనంతరం మాట్లాడుతూ ముస్లింలు కఠినమైన ఉపవాస దీక్ష చేపడతారని, రాబోయే రంజాన్ పండుగను ముస్లింలందరూ ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులు పాల్గొన్నారు.