బయటపడ్డ కిసాన్ ఖేత్ కాంగ్రెస్ అధ్యక్షుడి రాసలీలలు
అక్షర విజేత కామారెడ్డి బ్యూరో
నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత జిల్లా కిసాన్ ఖేత్ కాంగ్రెస్ అధ్యక్షుడు గా కొనసాగుతున్న ముప్ప గంగారెడ్డి రాసలీలలు బహిర్గతం అయ్యాయి నిజాంబాద్ రూరల్ నియోజకవర్గం లోని మోపాల్ మండలం నర్సింగ్ పల్లి గ్రామానికి చెందిన ఓ బీడీ కార్మికురాలితో గంగారెడ్డి రహస్యంగా 20 సంవత్సరాలుగా సహజీవనం చేస్తున్నాడని బాధితురాలు వాపోయింది తమకు పుట్టిన కుమారుడిని సైతం తమకు పుట్టలేదని గంగారెడ్డి అంటున్నాడని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది నేను డిఎన్ఏ పరీక్షకు కూడా సిద్ధంగా ఉన్నానని చెప్పుకొచ్చింది తాను గుండె సంబంధిత వ్యాధితో పాటు అనారోగ్య సమస్యతో బాధపడుతున్నానని ఈ విషయంలో గంగారెడ్డి తో డబ్బుల కోసం సంప్రదిస్తే చంపుతానని బెదిరింపులకు పాల్పడుతున్నాడని వాపోయింది తనకు న్యాయం చేయాలని బాధిత మహిళ తన కుమారుడితో కలిసి సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వచ్చింది కలెక్టర్ ఏవో కి ఫిర్యాదు చేసింది 20 సంవత్సరాల క్రితం తనను పెళ్లి చేసుకుంటానని మాయ మాటలు చెప్పి ఇప్పటివరకు వివాహం చేసుకోకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నాడని తెలిపింది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని తాను అంతా చూసుకుంటానని బాధితురాలు మీడియా ముందు వాపోయింది తనకు న్యాయం చేయాలని అధికారులను వేడుకుంటుంది.
బిజీగా ఉన్నా ఇప్పుడు మాట్లాడను
మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించి రాసలీలలకు పాల్పడుతున్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో అక్షర విజేత ముప్ప గంగారెడ్డిని సంప్రదించగా నేను ఆ విషయం ఇప్పుడు మాట్లాడలేను ఎవరికి సంజాయిసి ఇచ్చుకునే స్థితిలో లేనని దాటేసే ప్రయత్నం చేశారు ఉప్పగంగారెడ్డి మాట్లాడుతూ ఆ మహిళా ఎవరో తనకు తెలియదని నాకు ఆ మహిళకు ఎలాంటి సంబంధం లేదని చెప్పుకొచ్చారు.