వంజరి సంఘం రాష్ట్ర డైరెక్టర్ బొమ్మెల శంకర్ చెక్కు అందజెత
అక్షర విజేత కోరుట్ల ప్రతినిధి
కోరుట్ల మండలం సంగెం గ్రామంలోని వంజరి సంఘం అభివృధి కొరకు సోమవారం రోజు రాష్ట్ర డైరెక్టర్, ఎక్జిక్యూటివ్ మెంబర్ బొమ్మెల శంకర్ చేతుల మీదగా సంగెం గ్రామం వంజరి సంఘం అధ్యక్షుడు తుదిగేని రాజగోపాల్ కు ఒక లక్ష రూపాయల చెక్కును అందజేశారు. ఈ సంద్భంగా రాష్ట్ర డైరెక్టర్ బొమ్మేల శంకర్ మాట్లాడుతూ రాష్ట్ర అధ్యక్షులు కాలేరు నరేష్ ఆదేశాలమేరకు రాష్ట్ర సంఘం నిధుల నుండి మంజూరైన ఒక లక్ష రూపాయల చెక్కును సంగెం గ్రామం వంజరి సంఘం అభివృద్ధి కోసం అందజేస్తున్నాట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ వంజరి సంఘం అధ్యక్షుడు తుదిగేని రాజగోపాల్, రాష్ట్ర డైరెక్టర్ తుకారాం, బొదుకం సుధాకర్, అరే లక్ష్మీనారాయణ, తుదిగెని రవి, గోనె రాజు, తుదిగేని సత్యనారయణ, ఆరె రాజు, ఆరె రవి, రాజేందర్, కేర్తి రాజకుమార్, కేర్తి ఉమాపతి తదితరులు పాల్గొన్నారు.