ఆన్లైన్ మోసాలకు సైబర్ క్రైమ్ నీ సంప్రదించండి
అక్షర విజేత సిద్దిపేట్
సైబర్ నేరాలలో లక్ష రూపాయలు నుండి ఆపై డబ్బులు పోగొట్టుకున్న బాధితులు వెంటనే జాతీయ సైబర్ సెల్ హెల్ప్ లైన్ నెంబర్ 1930 కాల్ చేసి వివరాలు తెలపాలి. లేదా సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ .హెచ్ టి టి పి ఎస్ సైబర్ క్రైమ్ . జి ఓ వి . ఇన్. వివరాలు నమోదు చేయగలరు
తదుపరి సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ 2 ఫ్లోర్ లో ఉన్న సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కు వచ్చి నేరుగా దరఖాస్తు ఇచ్చినచో కేసు నమోదు చేసి పరిశోధన ప్రారంభించడం జరుగుతుంది.
ఒక రూపాయి నుండి 99,999 రూపాయల వరకు సైబర్ నేరాలలో డబ్బులు పోగొట్టుకున్న బాధితులు వెంటనే జాతీయ సైబర్ సెల్ హెల్ప్ లైన్ నెంబర్ 1930 కాల్ చేసి వివరాలు నమోదు పరచాలి. లేదా సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ హెచ్ టి టి పి ఎస్ సైబర్ క్రైమ్ . జి ఓ వి . ఇన్ వివరాలు నమోదు చేయగలరు
తదుపరి సంబంధిత పోలీస్ స్టేషన్కు వెళ్లి దరఖాస్తు ఇచ్చినచో పోలీస్ స్టేషన్లో కేసు నమోదు పరిశోధన ప్రారంభించడం జరుగుతుందని పోలీస్ కమిషనర్ డాక్టర్ బి. అనురాధ, ఐపీఎస్.,ఒక ప్రకటనలో తెలిపారు.