వైరా మున్సిపాలిటీ పరిధిలో ముస్లిం యూత్ అధ్యక్షునిగా షేక్ మహమ్మద్ రిజ్వాన్
అక్షర విజేత వైరా
వైరా మున్సిపాలిటీ పరిధిలోని హజరత్ అలీ ఇబ్నేతాలిబ్ మసీదులో శుక్రవారం ముస్లిం యూత్ కమిటీ ఎన్నికపై యువకులు సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో మున్సిపాలిటీ పరిధిలోని నిరుపేదలకు ఆర్థిక సాయం, ఖబరస్తాన్ లో పెరిగిన మొక్కలను తొలగించి అభివృద్ధి చేయు విషయాలతో పాటు తదితర అంశాలను చర్చించారు అనంతరం ముస్లిం యూత్ కమిటీ సభ్యులను అనుకున్నారు వైరా మున్సిపాలిటీ యూత్ అధ్యక్షుడిగా షేక్. మొహమ్మద్ రిజ్వాన్, ఉపాధ్యక్షుడిగా షేక్. ఖలీల్, గౌరవ ఉపాధ్యక్షుడిగా మహమ్మద్ రహీం ఖురేషి కార్యదర్శిగా పఠాన్ యాకూబ్ జానీ సెక్రటరీ జాయింట్ సెక్రటరీలుగా షేక్ సలీం షేక్ నయీం లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు అలాగే మున్సిపాలిటీ పరిధిలో వివిధ వార్డులలో ఉన్న యూత్ సభ్యుల ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి ఆ వార్డులలో వారు చేయాల్సిన పనులపై దిశనిర్దేశం చేశారు భవిష్యత్తులో యువకులందరూ ఏకతాటిపై నిలబడి ముస్లిం సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు కార్యక్రమంలో ముస్లిం యూత్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.