యూత్ కాంగ్రెస్ హత్నూరా మండల అధ్యక్షుడుని సన్మానించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి: దామోదర రాజనర్సింహ
అక్షర విజేత సంగారెడ్డి జిల్లా ప్రతినిధి:
హత్నూర మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు డాక్టర్ వరిగుంతం కృష్ణ రాష్ట్ర మంత్రి దామోదర్ రాజనర్సింహ ను సంగారెడ్డిలో ఆయన స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిశారు. అయితే ఈ మధ్యనే స్ఫూర్తి సర్వీసెస్ సమస్త ఆధ్వర్యంలో వరివంతం కృష్ణకు డాక్టరేట్ అవార్డు వచ్చినందున ఆయనను మంత్రి దామోదర్ నరసింహ శాలువా పూలమాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి సోషల్ మీడియా నాయకుడు సాయమల్ల సురేష్, యూత్ కాంగ్రెస్ నాయకులు సతీష్ పటేల్, యూత్ కాంగ్రెస్ నాయకులు నీరుడి అనిల్, గోవు శ్రీధర్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.